Chitrajyothy Logo
Advertisement
Published: Thu, 27 Jan 2022 20:46:54 IST

స్విమ్ సూట్‌లో.. యంగ్ హీరోయిన్లకు షాకిస్తోన్న సీనియర్ నటి

twitter-iconwatsapp-iconfb-icon
స్విమ్ సూట్‌లో.. యంగ్ హీరోయిన్లకు షాకిస్తోన్న సీనియర్ నటి

దక్షిణాది సీనియర్‌ హీరోయిన్‌ భూమిక చావ్లా తెలుగు, తమిళ భాషల్లో అనేక చిత్రాలలో నటించింది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా అప్పటి హీరోలందరి సరసన నటించిన భూమిక.. ఇప్పుడు లేటు వయస్సులోనూ యంగ్‌ హీరోయిన్లతో పోటీపడుతోంది. ఈ క్రమంలో ఆమె తాజాగా స్విమ్‌ సూట్‌తో ఈతకొలనులో ఉన్న వీడియోను తన ఇన్‌స్టా ఖాతాలో షేర్‌ చేసింది. ఇటీవల కాలంలో అనేక మంది యంగ్‌ హీరోయిన్లు స్విమ్ సూట్‌లో సందడి చేస్తున్నారు. ఇపుడు వారికి ధీటుగా, ఇంకా వారికి షాకిచ్చేలా.. 43 సంవత్సరాల వయసులో భూమిక స్విమ్‌ సూట్‌లో కనిపించడం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. వివాహం తర్వాత లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల్లో కీలక పాత్రలను పోషించిన ఆమె, ప్రస్తుతం టాలీవుడ్‌లో అక్క, వదిన పాత్రలలో నటిస్తూ నటిగా బిజీగా కొనసాగుతోంది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement