Abn logo
Oct 18 2021 @ 22:04PM

భూమి ఆక్రమించారని మహిళ ఆందోళన

డక్కిలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తున్న మహిళ

డక్కిలి, అక్టోబరు 18 : తన భూమిని గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆక్రమించుకుని తనను వేధిస్తున్నాడంటూ డక్కిలి మండలం మాధవాయపాళేనికి చెందిన కుంచం పుల్లమ్మ అనే దళిత మహిళ సోమవారం ఏపీ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేసింది. తన 34 సెంట్ల భూమిని అదేగ్రామానికి చెందిన చెలికం శివారెడ్డి ఆక్రమించుకున్నాడని అధికారులకు మొరపెట్టుకొన్నా న్యాయం జరగలేదన్నారు.  కాగా, ఆమెకు న్యాయం జరగకపోతే ఆందోళన చేస్తామని ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ గద్దల మునెయ్య హెచ్చరించారు. ఈ మేరకు తహసీల్దార్‌ ప్రసాద్‌కు వినతిపత్రం అదచేశారు.