కర్నూలు: జిల్లాలోని ఆళ్ళగడ్డ మండలం కృష్ణాపురం శివారులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను మాజీమంత్రి భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. మైనింగ్‌కు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అఖిలప్రియ ఆందోళన చేశారు. అధికారులు వెంటనే స్పందించి తక్షణమే చర్యలు చేపట్టక పోతే కోర్టుకు వెళ్తామని అఖిలప్రియ తెలిపారు.