భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురు

ABN , First Publish Date - 2021-01-11T17:35:33+05:30 IST

బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. అఖిలప్రియకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. భూమా అఖిలప్రియను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది.

భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురు

హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. అఖిల ప్రియకు న్యాయస్థానం బెయిల్ నిరాకరించింది. భూమా అఖిలప్రియను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. నేటి నుంచి మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఆమె ఉండనున్నారు.


ఈ కేసులో అఖిలప్రియకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు కోర్టులో కౌంటరు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాక్ష్యాల సేకరణకు దర్యాప్తు బృందాలు ప్రయత్నిస్తున్నాయని కోర్టుకు పోలీసులు తెలిపారు. అఖిలప్రియ బెయిల్‌పై వస్తే సాక్షులను బెదిరించే అవకాశం ఉందని కోర్టుకు సమర్పించిన కౌంటర్‌లో పేర్కొన్నారు. అఖిలప్రియ చర్యల వల్ల స్థానిక ప్రజలు అభద్రతాభావంలో ఉన్నారని తెలిపారు. అఖిలప్రియకు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావితం చేయగలిగే పలుకుబడి ఉందని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-01-11T17:35:33+05:30 IST