Oct 27 2021 @ 09:32AM

"భోళా శంకర్": ముహూర్తం కుదిరింది.

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న లేటెస్ట్ మూవీ 'భోళా శంకర్'. ఈ మూవీ మొదలుపెట్టేందుకు ముహూర్తం కుదిరింది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో తమిళ హిట్ మూవీ ‘వేదాళం’ రీమేక్‌గా ఇది రూపొందబోతోంది. ఇందులో చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటిస్తుంది. కీర్తి సురేశ్ మెగాస్టార్ చెల్లిగా కనిపించబోతోంది. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పూజా కార్యక్రమాలను 11-11-2021 తేదీన ఉదయం గం.7:45నిలకు నిర్వహించబోతున్నట్టు, రెగ్యులర్ షూటింగ్‌ను 15-11-2021 తేదీ నుంచి ప్రారంభించబోతున్నట్టు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను కూడా సోషల్ మీడియా ద్వారా వదిలారు.