'భోళా శంకర్': మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్

మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' కంప్లీట్ చేసిన వెంటనే మరో రెండు సినిమాలతో సెట్‌పైకి వచ్చేందుకు రెడీ అయ్యారు. వీటిలో ఇప్పటికే మళయాళ హిట్ మూవీ 'లూసిఫెర్' రీమేక్ 'గాడ్ ఫాదర్' మూవీని మొదలుపెట్టారు. ఓ వైపు ఈ చిత్ర షూటింగ్ జరుగుతుండగానే, తమిళ్ హిట్ చిత్రం 'వేదాళం' రీమేక్ 'భోళా శంకర్' మూవీని ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా..దసరా పండుగ సందర్భంగా మణిశర్మ తనయుడు మహతి స్వరసాగర్‌ను దీనికి సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్టు మెగాస్టార్ ప్రకటించారు. ఈ క్రమంలో తాజాగా 'భోళా శంకర్' చిత్రానికి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేసినట్టు దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు. ఈ మేరకు యువ సంగీత దర్శకుడు మహతి.. ట్యూన్ రెడీ చేసినట్టు తెలుపుతూ సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్ అప్డేట్ ఇచ్చాడు మెహర్ రమేష్. 


Advertisement