'భోళా శంకర్': సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ ఇచ్చిన మేకర్స్..

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలలో 'భోళా శంకర్' ఒకటి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజా సర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వచ్చింది. నవంబర్ నెలలో ఘనంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ ఇటీవలే సెట్స్‌పైకి వచ్చింది. ఇందులో  చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. మరో స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ చిరు చెల్లిగా కనిపించబోతుంది. తమిళ సూపర్ హిట్‌ 'వేదాళం'కు తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న 'భోళా శంకర్' చిత్రానికి సంబంధించి ఓ స్టైలిష్ ఫైట్ సీక్వెన్స్‌ను అలాగే, భారీ సెట్‌లో ఓ సాంగ్‌ను కంప్లీట్ చేసినట్టు చిత్రబృందం తెలిపింది. ఈ సాంగ్‌కు వి జె శేఖర్ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందించారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెకండ్ షెడ్యూన్‌ను కూడా ప్రారంభించారు. కాగా, ఏకే ఎంటర్‌టైనెమంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటే సమంతరంగా 'గాడ్ ఫాదర్', బాబీ చిత్రాల షూటింగ్‌లోనూ మెగాస్టార్ పాల్గొంటున్నారు. 

Advertisement