Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉత్సాహంగా భోగిమంటలు

నాయుడుపేట టౌన్‌, జనవరి 14 : సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా మొదటి పండగ అయిన భోగిరోజు గురువారం అర్దరాత్రి యువతీ, యువకులు ఎంతో ఉత్సాహంగా  భోగిమంటలు వేశారు. శుక్రవారం ఉదయం వరకు భోగిమంటలు వేస్తూనే ఉన్నారు.

పెళ్లకూరు: సంక్రాంతి పండుగ పర్వదినాల్లో భాగంగా మొదటి పండగ అయిన భోగి గురువారం రాత్రి ప్రారంభమైంది. మండలంలోని 24 పంచాయతీల్లో ప్రజలు ఉత్సాహంగా భోగిమంటలు వేసి పండగ జరుపుకున్నారు. యువత కేరింతలతో కరతుమ్మ చెట్ల దిమ్మెలను భోగిమంటలలో వేసి భోగేభోగే అని అరుస్తూ భోగిచుట్టూ తిరిగారు. శుక్రవారం తెల్లవారుజామున తలంటు స్నానాలు ఆచరించి మహిళలు, పిల్లలు కొత్తదుస్తులు ధరించి ఆలయాలకు వెళ్లి పూజలు నిర్వహించారు. 

Advertisement
Advertisement