ఆనందాల భోగి పండగ!

ABN , First Publish Date - 2022-01-14T05:30:00+05:30 IST

ఈ రోజు భోగి పండగ. సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకొనే ఈ పండగ భోగభాగ్యాలను మోసుకొస్తుందని నమ్మకం.

ఆనందాల భోగి పండగ!

ఈ రోజు భోగి పండగ. సంక్రాంతికి ఒకరోజు ముందు జరుపుకొనే ఈ పండగ భోగభాగ్యాలను మోసుకొస్తుందని నమ్మకం. 


ఈ రోజు ఉదయాన్నే అందరూ తాటాకాలతో భోగి మంటలు వేస్తారు. ఇంట్లో ఉన్న పాత సామగ్రిని భోగి మంటల్లో వేయడం సంప్రదాయంగా వస్తోంది. ఉదయాన్నే వేసే భోగి మంటల చుట్టూ పిల్లలూ, పెద్దలూ అందరూ చేరిపోతారు. జనవరి మాసంలో చలి ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు ఉపయోగపడతాయి. 

తెలుగు సంప్రదాయం ప్రకారం భోగి రోజున పిల్లల తలపై భోగిపళ్లు పోస్తారు. రేగు పళ్లనే భోగి పళ్లు అంటారు. రేగు పళ్లను తలమీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి ఆశీస్సులు పిల్లలకు లభిస్తాయని విశ్వసిస్తారు. 

సంక్రాంతి పండగ అనగానే గాలిపటాలు గుర్తొస్తాయి. ఎక్కడ చూసిన పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ కనిపిస్తారు. మీరు కూడా స్నేహితులతో కలిసి గాలిపటాలు ఎగరేయండి. అయితే జాగ్రత్తలు తీసుకోవడం మరువద్దు. 

Updated Date - 2022-01-14T05:30:00+05:30 IST