భోగి మంటలతో శ్రీకారం...సంక్రాంతికి ఆహ్వానం

ABN , First Publish Date - 2022-01-15T05:54:14+05:30 IST

తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతికి ఆహ్వానం పలుకుతూ శుక్రవారం భోగి మంటలతో సందడి చేశారు.

భోగి మంటలతో శ్రీకారం...సంక్రాంతికి ఆహ్వానం

- ప్రారంభమైన తెలుగువారి పెద్ద పండగ సందడి

నులివెచ్చని చలి గిలిగింతలు పెడుతుంటే వాకిట్లలో వెలిగిన భోగి మంటలు...మదినిండా ఆశల పరవళ్లతో ఇంటింటా కొత్త ర‘కాంతు’లు, వాకిళ్లలో అలరించిన రంగవల్లులతో పిల్లలు, పెద్దల సంబరాలు...తెలుగు వారి పెద్ద పండగ సంక్రాంతికి ఆహ్వానం పలుకుతూ శుక్రవారం భోగి మంటలతో సందడి చేశారు. ఉత్తరాయన పుణ్యకాలానికి స్వాగతం పలుకుతూ మూడు రోజుల ఆనందాలకు శ్రీకారం చుట్టారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. దివికేగిన పెద్దల ఆత్మల సంతృప్తి కోసం నేడు ప్రత్యేక కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. 

Updated Date - 2022-01-15T05:54:14+05:30 IST