Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 14 Jan 2022 19:51:58 IST

మెగా ‘భోగి’: చిరంజీవి వర్సెస్ వరుణ్ తేజ్.. వీడియోలు వైరల్

twitter-iconwatsapp-iconfb-icon
మెగా భోగి: చిరంజీవి వర్సెస్ వరుణ్ తేజ్.. వీడియోలు వైరల్

తెలుగు వారు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజైన భోగిని మెగా ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్యామిలీ అంతా ఒకచోటకు చేరి.. ఉదయాన్నే భోగి మంటలు, ఆ తర్వాత దోశలు వేసుకుని తినడం వంటి కార్యక్రమాలతో భోగి వేడుకలను చిరంజీవి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ పండుగకి సంబంధించిన వేడుకను ఎలా జరుపుకుందీ తెలిపేలా చిరంజీవి, వరుణ్‌తేజ్‌ వారి సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పోస్ట్ చేశారు. 


ముందుగా వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన వీడియోలో.. చిరంజీవి, వరుణ్ తేజ్‌‌లు దోశలు వేస్తున్నారు. ఇందులో చిరంజీవి వేసిన దోశ సరిగా రాలేదు. వరుణ్ తేజ్ దోశ చక్కగా వచ్చింది. దీంతో చిరు.. ‘వాడి దోశ చక్కగా వచ్చింది.. నాది సరిగా రాలేదు.. నాకు కుళ్లుగా ఉంది’ అంటూ.. వరుణ్ వేస్తున్న దోశను చిందరవందర చేసి.. ఇది దోశ కాదు ఉప్మా అంటూ చిరు అందరినీ నవ్వించారు. ఈ వీడియోలో దోశల కోసం సాయితేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక వంటి వారంతా లైన్‌లో నిలబడి ఉన్నారు. 


ఇక చిరంజీవి పోస్ట్ చేసిన వీడియోలో.. తన ఫ్యామిలీ సభ్యులందరిచేత చిరంజీవి భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పించారు. ముందుగా చిరంజీవి చెప్పి.. ఆ తర్వాత ఒక్కొక్కరి దగ్గరకు వెళ్లి.. చెప్పమని కోరారు. చిరంజీవి మదర్, చిరంజీవి సతీమణి, నాగబాబు, అల్లు అరవింద్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక.. ఇలా అందరూ చిరు కెమెరా ముందుకు వచ్చి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పుడీ రెండు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International