నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయం: భక్తబల్లా

ABN , First Publish Date - 2021-03-01T03:12:45+05:30 IST

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో నరేన్ వర్గం తరఫున భక్తబల్లా కార్యదర్శి పదవికి నామినేషన్ వేయగా.. తానా ఎన్నికల కమిటీ దాన్ని తిరస్కరించిం

నామినేషన్‌ను తిరస్కరించడం అన్యాయం: భక్తబల్లా

వాషింగ్టన్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో నరేన్ వర్గం తరఫున భక్తబల్లా  కార్యదర్శి పదవికి నామినేషన్ వేయగా.. తానా ఎన్నికల కమిటీ దాన్ని తిరస్కరించింది. దీనిపై నరేన్ వర్గం ఆందోళన వ్యక్తం చేసింది. అన్యాయంగా భక్తబల్లా నామినేషన్‌ను ఎన్నికల కమిటీ తిరస్కరించిందని ఆరోపిస్తున్నారు. దీనిపై కమిటీ స్పందిస్తూ.. తానా ఫౌండేషన్ ట్రస్టీగా భక్తబల్లా పదవీకాలం 2023 వరకు ఉందని.. ఆయన ఆ పదవికి రాజీనామా చేసినప్పటికీ అది సరైన సమయంలో అందకపోవడంతో నామినేషన్‌ను తిరస్కరించినట్టు ప్రకటించింది. ఈ క్రమంలో భక్తబల్లా స్పందించారు. తానా బైలాస్ ప్రకారం తాను వ్యవహరించానని.. అయినా ఎన్నికల కమిటీ తన నామినేషన్‌ను తిరస్కరించిందని అన్నారు. ‘ఇది నిజంగా దారుణం’ అని ఆయన వ్యాఖ్యానించారు. తనకు జరిగిన అన్యాయాన్ని బోర్డుకు లేఖ ద్వారా తీసుకెళ్లనున్నట్టు వెల్లడించారు. 


Updated Date - 2021-03-01T03:12:45+05:30 IST