Oct 28 2021 @ 08:03AM

'భీమ్లా నాయక్': దీపావళి కానుకగా టీజర్ ..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న తాజా చిత్రం 'భీమ్లా నాయక్'. ఈ మూవీ టీజర్ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మేకర్స్ ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుతూ వస్తున్నారు. ఇప్పటికే 'భీమ్లా నాయక్' మూవీ పోస్టర్స్, పవన్ కళ్యాణ్, రానా టీజర్స్, టైటిల్ సాంగ్..ఇటీవల వచ్చిన 'అంత ఇష్టం' లిరికల్ సాంగ్ అన్నీ వర్గాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే దీపావళి పండుగ సందర్భంగా మరో టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇందులో పవన్ సరసన నిత్యా మీనన్, రానా సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సీనియర్ దర్శక, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.