Oct 14 2021 @ 11:20AM

"భీమ్లా నాయక్": 'అంత ఇష్టం' సాంగ్ ప్రోమో రిలీజ్

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'భీమ్లా నాయక్'. తాజాగా ఈ మూవీ నుంచి 'అంత ఇష్టం' అనే సాంగ్ ప్రోమోను చిత్రబృందం వదిలింది. మలయాళంలో సూపర్ హిట్‌గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్‌'కు అఫీషియల్ తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందుస్తున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర తెరకెక్కిస్తున్నారు. ఇంతకముందు పవన్ పుట్టిన రోజు కానుకగా 'భీమ్లా నాయక్' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసి అభిమానులకు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకనిర్మాతలు. 

ఇదే క్రమంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15న 'అంత ఇష్టమేందయ్యా నీకు' అనే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ఈ సాంగ్ ప్రోమోను తాజాగా మేకర్స్ వదిలారు. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలోని ఫస్ట్ సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఇక త్వరలో రాబోతున్న సెకండ్ సింగిల్ 'అంత ఇష్టం' ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ మూవీని సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 2022, సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది.