Abn logo
Apr 20 2021 @ 23:58PM

భీమ్‌గల్‌ పట్టణాభివృద్ధికి సహకరించాలి

భీమ్‌గల్‌, ఏప్రిల్‌20 : భీమ్‌గల్‌ మున్సిపల్‌ పరిధిలో చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రతీఒక్కరు సహకరించాలని భీమ్‌గల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ అన్నారు. భీమ్‌గల్‌ పురపాలక కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మల్లెల రాజశ్రీ లక్ష్మణ్‌ అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన అంశాలను చదివి వినిపించగా ఇందుకు సభ్యుల ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ కరోనా వైరస్‌ తీవ్రమవుతున్న నేపథ్యంలో అన్ని వార్డుల్లో శానిటైజేషన్‌ నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న కర్ఫ్యూకు సహకరించాన్నారు. పట్టణంలో కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చేపట్టాల్సిన లాక్‌డౌన్‌ను విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ గోపు గంగాధర్‌, వైస్‌చైర్మన్‌ భగత్‌, కౌన్సిలర్‌లు కన్నె ప్రేమలత, లింగం నాయక్‌, మూత లత, బోదిరె నర్సయ్య, సీహెచ్‌.గంగాధర్‌, కైరున్సీఆబేగం, సతీష్‌గౌడ్‌, తుమ్మ భూదేవి, షమీమ్‌బేగం, మల్లెల అనుపామ, అజ్మతుల్లా, శోభ భూపతిరావు, నజీయాసుల్తానా, మున్సిపల్‌ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement