ఆ గ్రామంలో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సినేష‌న్ పూర్తి!

ABN , First Publish Date - 2021-06-13T12:34:25+05:30 IST

కరోనా వైరస్‌పై భార‌త్ భీక‌ర యుద్ధం చేస్తోంది.

ఆ గ్రామంలో 18 ఏళ్లు దాటిన అందరికీ వ్యాక్సినేష‌న్ పూర్తి!

చండీగఢ్: కరోనా వైరస్‌పై భార‌త్ భీక‌ర యుద్ధం చేస్తోంది. ఈ అంటువ్యాధికి అడ్డుక‌ట్ట వేసేందుకు వ్యాక్సినేషన్‌ను వేగ‌వంతం చేశారు. అయితే కొన్నిచోట్ల వ్యాక్సిన్ వేయించుకునేందుకు యువత అంత‌గా ఆస‌క్తి చూప‌డం లేదు. ఇటువంటి ప‌రిస్థితుల్లో పంజాబ్‌లోని ఒక గ్రామంలో 18 ఏళ్లు పైబ‌డిన‌వారంతా వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఆ గ్రామం పేరు భిఖి. పంజాబ్‌లోని లూధియానా జిల్లాలోగ‌ల‌ భిఖి గ్రామంలో 18 ఏళ్లు దాటిన మొత్తం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తయింది. ఈ సమాచారాన్ని అందించిన ఏడీసీ సందీప్ కుమార్ మాట్లాడుతూ భిఖి గ్రామంలోని యువ‌తకు వ్యాక్సినేషన్‌పై  అవగాహన ఏర్ప‌డింద‌ని, దీంతో అత్యంత వేగంగా వ్యాక్సినేషన్ పూర్తయిందని తెలిపారు. గ్రామంలో వంద‌శాతం వ్యాక్సినేష‌న్‌తో అనుకున్న లక్ష్యాన్ని సాధించామ‌న్నారు. మరోవైపు పంజాబ్‌లో కరోనా కేసుల సంఖ్య త‌గ్గుతూవ‌స్తోంది. గ‌డ‌చిన 24 గంటల్లో 1,316 మంది మాత్రమే కరోనా పాజిటివ్‌గా తేలారు.



Updated Date - 2021-06-13T12:34:25+05:30 IST