తగ్గేదేలే! యూస్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘భీమ్లా నాయక్’

ABN , First Publish Date - 2022-02-27T01:29:29+05:30 IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదలైన విషయం తెలిసిందే. ఒక్క అమెరికాలోనే 400పైగా థియేటర్లలలో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో

తగ్గేదేలే! యూస్‌లో కోట్లు కొల్లగొడుతున్న ‘భీమ్లా నాయక్’

ఓవర్సీస్ సినిమా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘భీమ్లా నాయక్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఈ నెల 25న విడుదలైన విషయం తెలిసిందే. ఒక్క అమెరికాలోనే 400పైగా థియేటర్లలలో రిలీజ్ అయిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబడుతోంది. అమెరికాలో ‘భీమ్లా నాయక్’ను విడుదల చేసిన ప్రైమ్ మీడియా సోషల్ మీడియా వేదికగా కీలక విషయాన్ని వెల్లడించింది. ఇప్పటి వరకూ ‘భీమ్లా నాయక్’ అమెరికాలో 1.5 మిలియన్ డాలర్లకుపైగా (Premier + Day 1 + Day 2 (Pre-sales)) వసూలు చేసినట్టు తెలిపింది. యూస్‌లో మూవీ రూ.11కోట్లకుపైగా కొల్లగొట్టడంపై ప్రైమ్ మీడియా ఆనందం వ్యక్తం చేసింది. 



ఇదిలా ఉంటే..భీమ్లా నాయక్ సినిమాలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటించారు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ కథానాయికలుగా యాక్ట్ చేశారు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనర్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'భీమ్లా నాయక్' చిత్రంతో పవర్ స్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 






Updated Date - 2022-02-27T01:29:29+05:30 IST