‘భీమ్లానాయక్‌’ వచ్చేది ఆ రోజే!

పవన్‌కల్యాణ్‌, రానా కథానాయకులుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. ఆ సమయంలోనే ఇతర హీరోల చిత్రాలు కూడా ఉండడంతో ‘భీమ్లా నాయక్‌’ విడుదల ముందు వెనుక కావచ్చని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే! దీనిపై మరోసారి నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. ఇటీవల ‘లాలా భీమ్లా’ రష్‌ చూశాను. మీరంతా  జనవరి 12న థియేటర్లు దద్దరిల్లేలా చేయడానికి సిద్ధంకండి’’ అని పేర్కొన్నారు మలయాళం సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా రూపొందతున్న చిత్రమిది. నిత్యా మీనన్‌, సంయుక్త మీనన్‌   నాయికలు. దర్శకుడు త్రివిక్రమ్‌ మాటలు అందిస్తున్నారు. తమన్‌ స్వరకర్త. ఇప్పటికే విడుదలైన పాటలు ట్రెండింగ్‌లో ఉన్నాయి. Advertisement