Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 25 Mar 2022 18:16:59 IST

కంటెంట్‌ ఉన్నోడి కటౌట్ చాలు.. ‘భీమ్లా నాయక్‌’ ఎలివేషన్‌!.. పోలా!

twitter-iconwatsapp-iconfb-icon

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, రానా దగ్గుబాటి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఇటీవలే థియేటర్లలో విడుదలై బ్లాక్‌బస్టర్ విజయం సాధించిన ఈ చిత్రాన్ని తాజాగా ఓటీటీలోనూ విడుదల చేశారు. భీమ్లా నాయక్‌ ఇప్పుడు డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ ద్వారా ఇంటిల్లిపాదినీ అలరిస్తున్నాడు. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ+హాట్‌స్టార్‌లో మార్చి 24 నుంచి స్ట్రీమింగ్‌ మొదలైన భీమ్లానాయక్‌ ఇప్పటికే రికార్డులు బద్దలుకొడుతుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డిస్నీ+హాట్‌స్టార్‌తో కలిసి పవర్‌స్టార్‌ అభిమానులు ఓ వినూత్నమైన ఎలివేషన్‌ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేశారు. మార్చి 25 సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో 300 మందికి పైగా పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు. 


‘కంటెంట్‌ ఉన్నోడికి కటౌట్‌ చాలు’ అని ‘గబ్బర్‌ సింగ్‌’లో  చెప్పినట్లుగా ‘భీమ్లా నాయక్‌’ సినిమాలో ఏ విధంగా అయితే పవన్‌ కళ్యాణ్‌ జీపుపై కూర్చుంటాడో అదే తరహాలో జీపుపై పవన్‌ కటౌట్‌ను ఆవిష్కరించారు. ఓ సినిమా ప్రమోషన్‌ కోసం భారీ స్ధాయిలో ఎలివేషన్‌ చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. పవన్‌ కళ్యాణ్‌ మాస్కులు ధరించి నెక్లెస్‌ రోడ్‌లో సందడి చేయడమే కాకుండా ఇటువంటి ఎలివేషన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఓ క్రేన్‌‌కు వేలాడదీసిన ఈ జీపు నెక్లెస్‌ రోడ్‌లో అన్ని వైపులా కనిపించేలా చేయడంతో పాటుగా పవన్‌ కళ్యాణ్‌ సినిమాల్లోని పాటలతో వీక్షకులలో ఆసక్తిని రేకెత్తించారు.

కంటెంట్‌ ఉన్నోడి కటౌట్ చాలు.. భీమ్లా నాయక్‌ ఎలివేషన్‌!.. పోలా!


కంటెంట్‌ ఉన్నోడి కటౌట్ చాలు.. భీమ్లా నాయక్‌ ఎలివేషన్‌!.. పోలా!


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement