Jul 7 2021 @ 14:18PM

టీటీడీకి నిర్మాత భవ్య ఆనందప్రసాద్‌ రూ. కోటి విరాళం!

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని నిత్యాన్నదానానికి ప్రముఖ నిర్మాత, పారిశ్రామికవేత్త వి. ఆనందప్రసాద్‌ కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. బుధవారం స్వామిని దర్శించుకున్న అనంతరం తిరుమలలో అడిషనల్‌ ఈవో ధర్మారెడ్డిని కలిసిన ఆనందప్రసాద్‌, కృష్ణకుమారి దంపతులు కోటి రూపాయల చెక్కును అందజేశారు. టీటీడీకి గతంలోనూ ఆనందప్రసాద్‌ రూ. కోటి విరాళం ఇచ్చిన విషయం విధితమే. టీటీడీ ఆధ్వర్యంలోని బర్డ్స్‌ ట్రస్టుకు 2015లో ఆ మొత్తాన్ని అందజేశారు. హైదరాబాద్‌లోని భవ్య భవన సముదాయ ప్రాంగణాలలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవాలయాలు నిర్మించిన సంగతి తెలిసిందే!