ఓలా, ఉబర్ విలీనమా? రబ్బిష్.. అవన్నీ పుకార్లే: Bhavish Agarwal

ABN , First Publish Date - 2022-07-30T17:18:35+05:30 IST

దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్లు(Cab Agrigators) ఓలా(Ola), ఉబర్‌(Uber) ఒక్కటి కాబోతున్నాయంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి.

ఓలా, ఉబర్ విలీనమా? రబ్బిష్.. అవన్నీ పుకార్లే: Bhavish Agarwal

Ola and Uber merge: దేశంలోని ప్రముఖ ఆన్‌లైన్‌ క్యాబ్‌ అగ్రిగేటర్లు(Cab Agrigators) ఓలా(Ola), ఉబర్‌(Uber) ఒక్కటి కాబోతున్నాయంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఇరువర్గాల మధ్య చర్చలుప్పటికే ప్రారంభమయ్యాయని... ఓలా సహ వ్యవస్థాపకులు, సీఈఓ భవిష్ అగర్వాల్‌(Bhavish Agarwal) ఈ మధ్యనే ఉబర్‌ యాజమాన్య ప్రతినిధులతో భేటీ అయ్యారంటూ ఆంగ్ల మీడియా వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే ఈ రెండు కంపెనీలు విలీనం(possible merger) దిశగా చర్చలు జరిపాయి. 


ఈ రెండు కంపెనీల్లోనూ పెట్టుబడులు కలిగిన అంతర్జాతీయ టెక్‌ ఇన్వె‌స్ట్‌మెంట్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌(Soft bank) ఈ దిశగా ప్రోత్సహించింది. అయితే అప్పట్లో చర్చలు ఫలప్రదం కాలేదు. కానీ కరోనా తర్వాత పరిస్థితుల్లో భారీ మార్పులు రావడంతో తిరిగి విలీన చర్చలు ప్రారంభమయ్యాయని వెల్లడించింది. అయితే దీనిపై తాజాగా భవిష్ అగర్వాల్ స్పందించారు. ఉబర్ యాజమాన్య ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారంటూ వస్తున్న వార్తలను ‘రబ్బిష్‌.. అవన్నీ పూర్తిగా పుకార్లే’ అంటూ భవిష్ అగర్వాల్ కొట్టిపడేశారు. 


దేశంలో తమ వ్యాపారం లాభాల బాటలో పయనిస్తోందని.. మున్ముందు ఇంకా మంచి పురోగతి సాధిస్తామని ఈ క్రమంలో విలీనమనే సమస్య లేదని స్పష్టం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కావాలనుకుంటే విదేశీ కంపెనీలు దేశం నుంచి నిష్క్రమించాలనుకుంటే వారికి స్వాగతమని.. తాము మాత్రం ఎప్పటికీ విలీనం కాబోమంటూ(We will never merge) అమెరికా కంపెనీ ఉబెర్‌(American Company Uber)కు ట్విటర్ వేదికగా వ్యంగ్యంగా భవిష్ అగర్వాల్ కౌంటర్ ఇచ్చారు. బలమైన బ్యాలెన్స్ షీట్‌(Strong balance sheet)తో ప్రపంచంలోనే అత్యంత లాభదాయకమైన రైడ్ హెయిలింగ్ కంపెనీలలో ఒకటిగా, అందులోనూ భారతదేశంలో మార్కెట్ లీడర్‌(Market leader)గా ఉన్నామని ఓలా ప్రకటించింది. 




Updated Date - 2022-07-30T17:18:35+05:30 IST