భావనా సక్సేనాకు రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ పతకం

ABN , First Publish Date - 2022-01-26T08:01:48+05:30 IST

గణతంత్ర దినోత్సవ వేళ.. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భావనా సక్సేనాకు రాష్ట్రపతి ఉత్తమ పోలీసు సేవా పతకం లభించింది. ...

భావనా సక్సేనాకు రాష్ట్రపతి ఉత్తమ పోలీస్‌ పతకం

  •  ఏపీలో 15 మందికి ‘ప్రతిభా’ పురస్కారాలు


న్యూఢిల్లీ, అమరావతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ణతంత్ర దినోత్సవ వేళ.. ఆంధ్రప్రదేశ్‌ కేడర్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిణి భావనా సక్సేనాకు రాష్ట్రపతి ఉత్తమ పోలీసు సేవా పతకం లభించింది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 సంవత్సరానికి గానూ విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించినందుకు ఆమెకు ఈ పురస్కారం దక్కింది. 1996 ఐపీఎస్‌ బ్యాచ్‌కు చెందిన సక్సేనా ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌ ప్రిన్సిపల్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. 2012లో కూడా ఆమె రాష్ట్రపతి ప్రతిభా అవార్డు అందుకున్నారు. 2015లో కమాండేషన్‌ లెటర్‌ ఆఫ్‌ డైరెక్టర్‌, ఇంటిలిజెన్స్‌ బ్యూరో ఫర్‌ ఔట్‌స్టాండిగ్‌ వర్క్‌లో రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. భావనా సక్సేనా గతంలో పశ్చిమ గోదావరి, ఖమ్మం, విజయనగరం జిల్లాల ఎస్పీగా సేవలందించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని మొత్తం 939 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధరకాల ఉత్తమసేవా పతకాలను మంగళవారం ప్రకటించింది. వాటిలో 189 మందికి శౌర్యపతకాలు, 88 మందికి విశిష్ట సేవా పురస్కారాలు, 662 మందికి ఉత్తమ సేవా పతకాలు లభించాయి.

 

ఏపీలో 15 మందికి ఉత్తమ సేవా పతకాలు..

ఉత్తమ సేవా పతకాల విభాగంలో ఏపీ నుంచి 15 మంది అధికారులకు పతకాలు లభించాయి. వీరిలో డీఐజీ ఆఫ్‌ పోలీస్‌ (శాంతిభద్రతల విభాగం) రాజశేఖర్‌బాబు, తూర్పుగోదావరి ఎస్పీ ఎం రవీంద్రనాథ్‌ బాబు, నెల్లూరు డీఎ్‌సపీ (సీఐడీ) వాకా శ్రీరాంబాబు, విజయవాడ ఈస్ట్‌ జన్‌ అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ కే విజయ్‌పాల్‌, విశాఖపట్నం గ్రేహౌండ్స్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ విజయ్‌కుమార్‌, విశాఖపట్నం అదనపు డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సుబ్రహ్మణ్యం కొలగాని, గుంటూరు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం డీఎస్పీ చుండూరు శ్రీనివాసరావు, అనంతపురం డీఎ్‌సపీ వీరరాఘవరెడ్డి,  కర్నూలు డీఎస్పీ రవీంద్ర రెడ్డి, విజయవాడ నగర సీసీఎస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గొల్ల కృష్ణారావు, కాకినాడ కమాండంట్‌ ఆఫీసులో అసిస్టెంట్‌ రిజర్వు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్తారు సింహాచలం, గుంటూరు అర్బన్‌ ఏఎ్‌సఐ నరేంద్రకుమార్‌ తూమాటి, కడప టూ టౌన్‌ ఏఎ్‌సఐ పేరూరు బాస్కర్‌, కొవ్వూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఏఎ్‌సఐ నాగ శ్రీనివాస్‌, విజయవాడ ఏసీబీ డీజీ ఆఫీసు ఏఎ్‌సఐ వీరాంజనేయులు ఉన్నారు.


అలాగే జైలు సిబ్బందికి సంబంధించి ఉత్తమ సేవలకు గాను హెడ్‌వార్డర్‌గా పనిచేస్తున్న అయినపర్తి సత్యనారాయణకు రాష్ట్రపతి కరెక్షనల్‌ సర్వీస్‌ పతకం లభించింది. దేశవ్యాప్తంగా 37 మందికి ఈ అవార్డులు ప్రకటించగా ఏపీకి చెందిన డిప్యూటీ సూరింటెండెంట్లు పోచా వరుణరెడ్డి, పెదపూడి శ్రీరామచంద్రరావు, మహ్మద్‌ షఫీ ఉర్‌ రహ్మాన్‌, హంసపాల్‌తోపాటు హెడ్‌వార్డర్‌ సముడు చంద్రమోహన్‌ ఉన్నారు. అలాగే ఏపీలో వివిధ శాఖలకు చెందిన జీ సంజయ్‌కుమార్‌, టీ వెంకట సుబ్బయ్య, నిర్జోగి గణేష్‌ కుమార్‌లకు ‘జీవన్‌ రక్ష పతక్‌’ కేటగిరీలో ఉత్తమ సేవా అవార్డులు లభించాయి.


దేవేంద్రన్‌కు విశిష్ట సేవా పతకం..

న్యూఢిల్లీలో సీబీఐ అదనపు న్యాయ సలహాదారుగా పనిచేస్తున్న ఎస్‌ దేవేంద్రన్‌కు మెరిటోరియస్‌ సర్వీస్‌ పోలీస్‌మెడల్‌ లభించింది. ఆయనది చిత్తూరుజిల్లా, గంగాధరనెల్లూరు మండలం, ఎట్టేరి గ్రామం. 2021 నుంచి సీబీఐలో సలహాదారుగా పనిచేస్తున్నారు. అలాగే విశాఖపట్నంలోని డైరెక ్టర్‌ జనరల్‌ ఆఫ్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ టాక్స్‌ ఇంటిలిజెన్స్‌ జోనల్‌ ఆఫీసులో సీనియర్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న వీడీ చంద్రశేఖర్‌కు, విశాఖలోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌ ఇండైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్కోటిక్స్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో అదనపు సహాయకునిగా పనిచేస్తున్న కర్రి వెంకట మోహనరావుకు రాష్ట్రపతి ఉత్తమసేవా పతకాలు లభించాయి.

Updated Date - 2022-01-26T08:01:48+05:30 IST