ఒక్కేసి పువ్వేసి చందమామ...

ABN , First Publish Date - 2022-10-04T04:02:18+05:30 IST

తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో ... రామరామ ఉయ్యాలో .. రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఒక్కేసి వలగపండే గౌరమ్మ.. దూరాన దోరపండే గౌరమ్మా.. చిత్తూ చిత్తుల బొమ్మ... శివునీ ముద్దు గుమ్మ అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు.

ఒక్కేసి పువ్వేసి చందమామ...
చెన్నూరులో బతుకమ్మఆడుతున్న మహిళలు

ఘనంగా సద్దుల బతుకమ్మ 

మంచిర్యాల కలెక్టరేట్‌/ఏసీసీ, అక్టోబరు 3: తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు అద్దంపట్టే సద్దుల బతుకమ్మ వేడుకలు  సోమవారం వైభవంగా జరిగాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో ... రామరామ ఉయ్యాలో .. రామనే శ్రీరామ ఉయ్యాలో.. ఒక్కేసి వలగపండే గౌరమ్మ.. దూరాన దోరపండే గౌరమ్మా.. చిత్తూ చిత్తుల బొమ్మ... శివునీ ముద్దు గుమ్మ అంటూ మహిళలు బతుకమ్మ పాటలతో హోరెత్తించారు. ఆలయ ప్రాంగణాల్లో, వీధులు, కూడళ్ల వద్ద మహిళల బతుకమ్మ ఆటలతో సందడి నెలకొంది. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు సంప్రదాయ వస్ర్తాలంకరణలతో ఆడుతూ పాడుతూ వేడుకల్లో పాల్గొన్నారు. ఉదయం నుంచే తంగెడు, గునుగు, సీత జడలు, కట్ల, గుమ్మడి పూల సేకరణలో నిమగ్నమై పోటీ పడి పూలను సేకరిస్తూ విభిన్న రూపాల్లో బతుక మ్మలను పేర్చి అందంగా తీర్చిదిద్దారు. నూతన వస్ర్తాలు, నగలు ధరించి ఒక్కచోటగా చేరి పాటలు పాడుతూ బతుకమ్మకు వీడ్కోలు పలికారు. చెరువులు, వాగుల్లో నిమజ్జనం అనంతరం ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. 

జిల్లా వ్యాప్తంగా సోమవారం సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. రంగు రంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మ ను చేసి   వివిధ వాడల్లో బతుకమ్మలను చౌరస్తాలు, ఇండ్ల ఎదుట ఏర్పాటు చేసి మహిళలు భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. మహిళలు, చిన్నారుల ఆటాపాటలు, కోలాటాలతో ఆనందోత్సాహాల మధ్య పండు గను జరుపుకున్నారు. అనంతరం సమీపంలోని  రాళ్లవాగు, రాముని చెరువు, పోచమ్మ చెరువు, నీటి కొలనుల్లో నిమజ్జనం చేశారు. జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాల, ఆండాలమ్మ కాలనీ, రాంనగర్‌, జన్మభూ మినగర్‌, రెడ్డి కాలనీ, హమాలివాడ, కాలేజీ రోడ్డు చున్నంబట్టివాడ, ఏసీసీ,  సూర్య నగర్‌, తదితర ఏరియాల్లో బంతి, చామంతి,  గులాబి, గునక పూలతో భారీ ఎత్తున పేర్చిన బతుకమ్మలు అలరించాయి. పట్టణంలో నిర్వహిం చిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే దివాకర్‌రావు పాల్గొని మహిళలకు అభినందనలు తెలిపారు.   

Updated Date - 2022-10-04T04:02:18+05:30 IST