KCRవి బోగస్‌ నోటిఫికేషన్లు బూటకపు మాటలు: భట్టి

ABN , First Publish Date - 2022-05-20T00:50:33+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోగస్‌ నోటిఫికేషన్లు, బూటకపు మాటలతో, నిరుద్యోగ భృతిని గంగలో కలిపి, ఎన్నికల హామీని తుంగలోకి తొక్కిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు.

KCRవి బోగస్‌ నోటిఫికేషన్లు బూటకపు మాటలు: భట్టి

ఖమ్మం: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బోగస్‌ నోటిఫికేషన్లు, బూటకపు మాటలతో, నిరుద్యోగ భృతిని గంగలో కలిపి, ఎన్నికల హామీని తుంగలోకి తొక్కిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులను మభ్యపెడుతూ కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఫీజ్‌రీయింబర్సుమెంట్‌ ద్వారా లక్షలమంది నిరుపేద విద్యార్ధులకు చదువుకునేందుకు అవకాశం కల్పించి వారి జీవితాల్లో వెలుగులు నింపిందని గుర్తుచేశారు. ప్రస్తుత కేసీఆర్‌ ప్రభుత్వం ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇచ్చి, వంద రోజుల ఉపాధి హామీ జాబ్‌కార్డులను ఇస్తోందని ఎద్దేవాచేశారు. దాంతో ఉద్యోగాలు లేక ఉన్నత చదువులు చదువుకున్న యువకులు ఉపాధి పనులకు వెళుతున్నారని, ప్రభుత్వం తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ధాన్యం కొనుగోలును ఆలస్యం చేయకుండా, అకాల వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులు నష్టపోకుండా ఆదుకోవాలని భట్టి విక్రమార్క కోరారు.

Updated Date - 2022-05-20T00:50:33+05:30 IST