కేసీఆర్‌పై మండిపడ్డ భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2022-02-28T21:16:43+05:30 IST

సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

కేసీఆర్‌పై మండిపడ్డ భట్టి విక్రమార్క

ఖమ్మం: సీఎం కేసీఆర్‌పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. నకిలీ విత్తనాలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు వేయడానికి ప్రభుత్వం విత్తనాలు ఇవ్వలేదని, దీనికి సీఎం కేసీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని, రైతులకు క్రాఫ్‌ లోన్, పావలా వడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ పాలసీ దుర్మార్గంగా ఉందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షా 25 వేల కోట్లు మింగారని ఆరోపించారు. ఢిల్లీలో మోదీ, హైదరాబాద్‌లో కేసీఆర్‌ డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 8 ఏళ్లలో కేసీఆర్‌ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో బడ్జెట్‌ మాత్రం లక్షల కోట్లు దాటుతోందని భట్టి విక్రమార్క తెలిపారు.

Updated Date - 2022-02-28T21:16:43+05:30 IST