హైదరాబాద్: రాష్ట్రంలో శాంతిభద్రతల అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కాంగ్రెస్ సినియర్ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. వనమా రాఘవ దాష్టికం, రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథనిలో అడ్వకేట్ హత్య ఘటనలు గవర్నర్‌కు గుర్తుచేశామన్నారు. పోలీసుల నుంచి రక్షణ ఉంటుందనే భావన ప్రజలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతలు చెప్తేనే పోలీసుల దగ్గర న్యాయం జరుగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి