కోవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఎప్పుడు ఇస్తుంది?: భట్టి విక్రమార్క

ABN , First Publish Date - 2021-11-25T20:58:31+05:30 IST

సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు.

కోవిడ్‌తో చనిపోయిన వారికి ప్రభుత్వం పరిహారం ఎప్పుడు ఇస్తుంది?: భట్టి విక్రమార్క

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌కు సీఏల్పీ నేత భట్టి విక్రమార్క బహిరంగ లేఖ రాశారు. కరోనా భారిన పడి ఎందరో తమ జీవితాలు, ఆస్తులను పోగొట్టుకున్నారని అన్నారు. ఇలాంటి కష్ట సమయంలో ప్రభుత్వం కోవిడ్ భారిన పడి చనిపోయిన వారికి ఎక్స్ గ్రేషియా వీలైనంత ఎక్కువ ప్రకటించాలని కోరారు. కోవిడ్ భారిన పడి చనిపోయిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ఎప్పుడు ఇస్తుందని ప్రశ్నించారు. రూ. 50 వేల ఎక్స్ గ్రేషియా సరిపోదని, రూ. 4 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. రూ. 4 లక్షల పరిహారం ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం వాదిస్తోందని, ఇది సరైన వాదన కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం 75 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం పరిహారం ఇవ్వాలని నిర్ణయించుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో తెలియజేయాలని భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

Updated Date - 2021-11-25T20:58:31+05:30 IST