Abn logo
Sep 27 2021 @ 11:40AM

పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి: భట్టి విక్రమార్క, సీతక్క

హైదరాబాద్: దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయని, పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని సీఎల్సీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. సోమవారం భారత్ బంద్ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు సామాన్య ప్రజలకు భారంగా మారాయన్నారు. కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనకు పిలుపునిచ్చిందన్నారు. దానికి నిరసనగా గాంధీ భవన్ నుండి గుర్రపు బండి మీద అసెంబ్లీకి వెళ్తున్నామన్నారు.


ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ కేంద్ర విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల రైతులు నష్టపోతున్నారన్నారు. వ్యవసాయ రంగాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టే కుట్ర కేంద్రం చేస్తుంటే.. దాన్ని సీఎం కేసీఆర్ సమర్ధిస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై నిర్ణయం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption