కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఊర్కోం

ABN , First Publish Date - 2021-01-14T07:50:26+05:30 IST

రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊర్కోబోదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు

కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తే ఊర్కోం

సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలి

సీఎం కేసీఆర్‌కు భట్టి లేఖ 


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంటల కొనుగోలు కేంద్రాలను ఎత్తివేస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊర్కోబోదని  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేయాల్సిందేనని స్పష్టం చేశారు. నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించాలని, ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అసెంబ్లీ మీడియాపాయింట్లో మీడియా సమావేశంలో ఈ లేఖను విడుదల చేశారు. సీఎం కేసీఆర్‌ వ్యక్తిగత, స్వార్థపూరిత, ఆర్థిక ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.  

Updated Date - 2021-01-14T07:50:26+05:30 IST