హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు భట్నాగర్‌ అవార్డు

ABN , First Publish Date - 2020-09-27T08:23:54+05:30 IST

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురాజిత్‌ ధారా ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ (ఎస్‌ఎ్‌సబీ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ-2020 అవార్డుకు ఎంపికయ్యారు...

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌కు భట్నాగర్‌ అవార్డు

  • సురాజిత్‌ ధారాకు శాంతిస్వరూప్‌ పురస్కారం
  • హైదరాబాద్‌ శాస్త్రవేత్త శుభదీప్‌ ఛటర్జీకి కూడా

న్యూఢిల్లీ/గచ్చిబౌలి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) స్కూల్‌ ఆఫ్‌ ఫిజిక్స్‌ అధ్యాపకుడు ప్రొఫెసర్‌ డాక్టర్‌ సురాజిత్‌ ధారా ప్రతిష్ఠాత్మక శాంతిస్వరూప్‌ భట్నాగర్‌ (ఎస్‌ఎ్‌సబీ) సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ-2020 అవార్డుకు ఎంపికయ్యారు. ఈయనతోపాటు మొక్కల్లో వ్యాధికార క బాక్టీరియా వ్యాప్తిని అరికట్టడంలో విశేషంగా కృషి చేస్తున్న హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్‌ (సీడీఎఫ్‌డి) శాస్త్రవేత్త డాక్టర్‌ శుభదీప్‌ ఛటర్జీకి కూడా అవార్డు లభించింది. శనివారం సీఎ్‌సఐఆర్‌ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది అవార్డుకు ఎంపికైన వారి పేర్లను ప్రకటించారు.


Updated Date - 2020-09-27T08:23:54+05:30 IST