బెంగళూరు: బెంగళూరు నగర పూర్వపు పోలీసు కమిషనర్, ఏడీజీపీ భాస్కర్‌రావు స్వచ్ఛంద పదవీ విరమణకు ప్ర భుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. ఈనెల 31న ఆ యన పదవి నుంచి విముక్తులు కానున్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి భాస్కర్‌రావు స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతూ సెప్టెంబరులో దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని దరఖాస్తులో విన్నవించుకున్నారు. అప్పట్లోనే పదవీవిరమణ పొందుతారని ఆయన భావించారు. కానీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ముఖ్యమంత్రి వద్దనే ఫైల్ పెండింగ్‌లో ఉండేది. తాజాగా సీఎం బసవరాజ్ బొమ్మై వీఆర్‌ఎస్ ఫైలుకు ఆ మోదం తెలిపారు. ఇదే విషయమై భాస్కర్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతానికి సొంతూరుకు వెళ్లి కుటుంబ సభ్యులతో గడపాలనుకుంటున్నట్లు తెలిపారు. రాజకీయాలలోకి వెళ్లే విషయమై ఇంకా నిర్ణయించుకోలేదన్నారు. కాగా ఆయన రాజకీయాలలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇవి కూడా చదవండి