12న భార్యాబాధితుల సంఘం కోర్‌ కమిటీ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-06-10T17:41:06+05:30 IST

భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు

12న భార్యాబాధితుల సంఘం కోర్‌ కమిటీ ఏర్పాటు

హైదరాబాద్ సిటీ/చిక్కడపల్లి : భార్యాబాధితుల సంఘం ఆధ్వర్యంలో కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.బాలాజీరెడ్డి తెలిపారు. ఈ నెల 12న ఉదయం 9గంటలకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సంఘం విస్తృతస్థాయి సమావేశంలో పలు అంశాల గురించి చర్చించినట్లు తెలిపారు. సమాజంలో మానవ హక్కులు, సమాజ శ్రేయస్సు కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో రకాల చట్టాలు చేశాయని ముఖ్యంగా మహిళలకు అనేక రకాల చట్టాలు తెచ్చాయని తెలిపారు. 


కొందరు ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తున్న అంశాలపై ప్రధానంగా సమావేశంలో ప్రసంగిస్తామన్నారు. భార్యలు పెట్టిన కేసుల వల్ల భర్తలు, వారి కుటుంబ సభ్యులు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అనేక రకాలుగా ఇబ్బందులకు గురి అవుతున్నారన్నారు. భార్యాబాధితులు అయినా కాకపోయినా ప్రతి ఒక్కరూ ఈ సమావేశంలో పాల్గొని భర్తలు అనుభవిస్తున్న ఆవేదనను ప్రభుత్వానికి, పార్లమెంటుకు తెలియజేయడానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాల్గొనే ఆసక్తి ఉన్నవారు ఫోన్‌ నెం.7093434730ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Updated Date - 2022-06-10T17:41:06+05:30 IST