మహిళా బద్రత, సంరక్షణకు “ఉమెన్ సేఫ్టీ వింగ్”

ABN , First Publish Date - 2022-07-05T01:00:46+05:30 IST

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశంతో మహిళా బద్రత, సంరక్షణ కు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది.

మహిళా బద్రత, సంరక్షణకు “ఉమెన్ సేఫ్టీ వింగ్”

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్ధేశంతో మహిళా బద్రత, సంరక్షణ కు  ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా దేశంలోనే తొలి సారిగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ అధికారి స్థాయి ఆధ్వర్యంలో “ఉమెన్ సేఫ్టీ వింగ్”ను(women safty wing) ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం ఒకప్రకటనలో తెలిపింది. దీని ద్వారా మహిళల ఆత్మ విశ్వాసాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపింది. ఈ మహిళా భద్రతా విభాగంలో షీ టీమ్స్, భరోసా, షీ భరోసా సైబర్ ల్యాబ్, మానవ అక్రమ రవాణా నివారణ తో పాటు ఆపరేషన్ స్మైల్, ముస్కాన్ ప్రవేశపెట్టి సమర్దవంతంగా అమలు చేస్తోంది. మహిళలు ఎదురుకుంటున్న పలు సమస్యలపై వారు ప్రత్యేక్షంగా గాని, పరోక్షంగా గాని భరోసా(bharosa) కేంద్రాలలో ఫిర్యాదు చేసుకొనేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీనిలో భాగంగా 2021 సంవత్సరంలో మొత్తం 5145 ఫిర్యాదులు అందగా వాటిని సమర్దవంతంగా పరిష్కరమయ్యాయి.


మహిళలు సమాజంలో ఎదురుకుంటున్న పలు సమస్యలపై వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వారీలో భరోసా కల్పించే దిశగా రాష్ట్రంలో 6 భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, వికారాబాద్, వరంగల్, సంగారెడ్డి, నల్గొండ,సూర్యాపేటలో ఏర్పాటు చేసిన ఈ భరోసా కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయి. వీటితో పాటు కొత్తగా మేడ్చల్,మాల్కాజ్ గిరి, మెదక్, ఖమ్మం,కరీంనగర్ జిల్లాలలో ను ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది. అదే విధంగా హైదరాబాద్ పాత బస్తీ, సైబరాబాద్ , రాచకొండ పోలీస్ కమీషనరేట్ల పరిదిలో కూడా భరోసా కేంద్రాలను  ఏర్పాటు చేశారు. 


“మానవ అక్రమ రవాణా కు చెక్”

మానవ అక్రమ రవాణా రాష్ట్రాలకు అతి పెద్ద సమస్యగా మారింది. మానవ అక్రమ రవాణా నిరోదక చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి బాధిత మహిళలకు చేయూతనిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అక్రమ రవాణకు గురవుతున్న వారిని గుర్తించి రక్షించడంతో పాటు వివిధ అంశాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తూ ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఏర్పాటు చేయడమే కాకుండ అవగాహన సదస్సులు నిర్వహిస్తుంది. 


పిల్లలు, మహిళలపై సైబర్ నేరాలు, ఆన్ లైన్ ట్రాఫికింగ్ అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్, షీ సైబర్ సెల్ ఏర్పాటు చేసింది. హ్యూమన్ ట్రాఫికింగ్ గురించి తెలుసుకోడానికి ప్రభుత్వం ధృవ పోర్టల్ ఏర్పాటు చేసింది. ట్రాఫికంగ్ కు గురైన మహిళల కోసం రాష్ట్రంలో నాలుగు అబ్జర్వేషన్ హోమ్స్, రెండు స్పెషల్ హోమ్స్ ఏర్పాటు చేశారు. అలాగే ఒడిషా నుంచి వలస వచ్చిన కూలీల పిల్లల కోసం, ట్రాఫికింగ్ లో గుర్తించిన వారికోసం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ లో పోలీస్ శాఖ, శిశు సంక్షేమ శాఖలు సంయిక్తంగా ఒరియా పాఠశాలను ఏర్పాటు చేసింది.


మానవ అక్రమ రవాణాపై అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం రాష్ట్రంలో అన్ని ఐసీడీస్ ప్రాజెక్టులలో స్వరక్ష- డే  నిర్వహిస్తు్న్నారు. అంతర్ రాష్ట్ర మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం  మొదటి స్థానం సంపాదించింది. అక్రమ రవాణా నిరోదించడానికి హెల్ప్ లైన్ 100, మహిళా హెల్ప్‌ లైన్‌ 181, 1098 చైల్డ్‌ లైన్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. అడిషనల్ జనరల్ పోలీస్ ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్ – VIII కార్యక్రమం జూలై నెల ఒకటో తేది నుండి జూలై 31 తేది వరకు నిర్వహిస్తారు. ఈ ఆపరేషన్ ముస్కాన్ లో తప్పిపోయిన పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలు గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Updated Date - 2022-07-05T01:00:46+05:30 IST