ఇకపై అతడికి కంపెనీతో సంబంధం లేదు: భారత్ పే

ABN , First Publish Date - 2022-03-02T23:21:35+05:30 IST

భారత్ పే సంస్థ మాజీ ఎండీ, కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ కంపెనీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్టట్లు తమ అంతర్గత విచారణలో తేలిందని భారత్ పే సంస్థ వెల్లడించింది. తన పదవులకు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన మరునాడే కంపెనీ ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం.

ఇకపై అతడికి కంపెనీతో సంబంధం లేదు: భారత్ పే

భారత్ పే సంస్థ మాజీ ఎండీ, కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ కంపెనీలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్టట్లు తమ అంతర్గత విచారణలో తేలిందని భారత్ పే సంస్థ వెల్లడించింది. తన పదవులకు అష్నీర్ గ్రోవర్ రాజీనామా చేసిన మరునాడే కంపెనీ ఈ వివరాలు వెల్లడించడం గమనార్హం. కంపెనీలో జరిగిన నిధుల దుర్వినియోగంలో అష్నీర్‌తోపాటు అతడి భార్య మాధురి జైన్ గ్రోవర్, ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తమ విచారణలో తేలినట్లు భారత్ పే తెలిపింది. దీంతో బుధవారం నుంచి కంపెనీలో అష్నీర్‌కు ఎలాంటి భాగస్వామ్యం లేదని, ఉద్యోగిగా కూడా కొనసాగించలేమని స్పష్టం చేసింది. గతవారం అష్నీర్ భార్య మాధురి జైన్‌ను కూడా కంపెనీ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ‘అష్నీర్ అతడి కుటుంబ సభ్యులు కంపెనీ నిధుల్ని దుర్వినియోగం చేశారు. ఫేక్ కంపెనీలను సృష్టించారు. తమ సొంత ప్రయోజనాల కోసం, లగ్జరీ లైఫ్‌స్టైల్ కోసం కంపెనీ నిధుల్ని వాడుకున్నట్లు విచారణలో’ తేలింది అని భారత్ పే ప్రకటించింది. అయితే, తనపై భారత్ పే చేస్తున్న విమర్శలను అష్నీర్ ఖండించాడు. కంపెనీ తనపై అర్థరహితమైన ఆరోపణలు చేస్తోందని విమర్శించాడు. 

Updated Date - 2022-03-02T23:21:35+05:30 IST