అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ..!

ABN , First Publish Date - 2022-05-04T02:27:24+05:30 IST

అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ..!

అమరగాయకుడు ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలంటూ సంతకాల సేకరణ..!

వివరాలకు వెళ్ళేముందు దయచేసి ఈ లంకె ను నొక్కి మీ మద్దతు తెలియ చేయండి: https://www.change.org/BharatRatnaForGhantasalaGaru


అమరగాయకుడు, ప్రముఖ సంగీత దర్శకులు, స్వాతంత్ర సమరయోధుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శత జయంతి వేడుకల సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వడం సముచితమనే నినాదంతో యు.యెస్.ఏ నుండి శంకర నేత్రాలయ యు.యెస్.ఏ. అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 90 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇందులో భాగంగా యు.యెస్.ఏ నుండి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 1 మే 2022 నాడు జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమములో పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భార్య భర్తను ఎలా పేరు పెట్టి పిలవదో, గురువుని కూడా పేరు పెట్టి పిలవరని, ఘంటసాల వెంకటేశ్వర రావు మనందరికీ గురువు అని చెప్పారు. ఆయన ఒక కర్మయోగి, మహాజ్ఞానీ, తపస్వి అని, ఆ అమరగాయకుడి జీవితం ఒక తపస్సు అని వ్యాఖ్యానించారు. 


‘‘నేను ఒక స్వామిజి అయినా  మీరు అందరు చేస్తున్న ప్రయత్నాలకు నేను నమస్కరిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు. అమరగాయకుడికి భారతరత్న కోసం వారు చేస్తున్న కృషిని కొనియాడారు. భారతరత్నకి ఘంటసాల పూర్తిగా అర్హులని చెపుతూ గారి గొప్పతనాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు. ఒక అమరగాయకుడుగా, సంగీత దర్శకుడుగా 10,000 పైగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తుళు బాషలలో పాటలతో పాటు అనేక ప్రైవేట్ ఆల్బమ్స్ పుష్ప విలాపం, కుంతీ విలాపం, దేశభక్తి గీతాలు పాడటం, వ్యాఖ్యానంతో సహా ఆయన ఆలపించిన భగవద్గీత  ఇప్పటికి తెలుగువారి ఇళ్లలో మారుమోగుతోందని అని చెప్పారు. అలాగే స్వీయ సంగీత దర్శకుడిగా 110 కంటే ఎక్కువ సినిమాలకు సంగీత దర్శకత్వం వహించి ఆణిముత్యాల్లాంటి పాటలను అందించి, తన అమృత గాత్రంతో ఆ పాటలకు జీవం పోశారని చెప్పారు. అలాగే 15వ శతాభ్దం అన్నమయ్య తరువాత తిరుపతి దేవస్థానం గర్భగుడిలో పాటలు పాడిన ఏకైక గంధర్వ గాయకుడని చెప్పారు. పిన్న వయస్సులోనే దేశంకోసం పోరాడి, స్వాతంత్ర సమరయోధుడుగా 18 నెలల జైలు శిక్షని అనుభవించిన గొప్ప దేశభక్తుడని ఘంటసాలఅని కొనియాడారు. ఘంటసాలకు భారతరత్న కోసం change.orgలో నేను సంతకం చేస్తున్నాని తెలిపారు.  


ఈ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఇంకా ఉదృతం చేయాలని పిలుపునిచ్చారు. 15 కోట్ల మంది తెలుగు వారి ఆకాంక్షలు కేంద్ర పాలకులకు చేరేంతవరకు అందరు ప్రయత్నాలను కొనసాగించాలని దిశా నిర్దేశం చేసారు. ఈ కార్యక్రమంలో యు.యెస్.ఏ నుండి నాటా మాజీ అధ్యక్షుడు డా. రాఘవ రెడ్డి గోసాల,  NATS అధ్యక్షుడు శ్రీ. విజయ శేఖర్ అన్నే,  ధర్మయోగి ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రాంకుమార్ యడవల్లి, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు రమేష్ బాబు చాపరాల, నారాయణరెడ్డి ఇందుర్తి, భారతదేశం నుండి సంకలనకర్త, ఘంటసాల గాన చరిత, చల్లా సుబ్బారాయుడు, సింగపూర్ నుండి శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు తదితరులు పాల్గొన్నారు.  పూజ్య బ్రహ్మశ్రీ పరిపూర్ణానంద స్వామి పాల్గొనడం ఈ కార్యక్రమానికి ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని, మరింత ఉదృతం చేయడానికి తోడ్పాటు అందించారని వారు వ్యాఖ్యానించారు.  ఘంటసాల పాటలతో తమకున్న అభిమానాన్ని, వారి పాటలలోని మాధుర్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఘంటసాలకు భారతరత్న దక్కకపోవడం చాలా బాధాకరమని, ఇది తెలుగువారి ఆత్మ గౌరవానికి సంబంధించినదని అభిప్రాయపడ్డారు.  


ఘంటసాలను కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డుతో సత్కరించాలని అభ్యర్ధించారు. ఈ దిశగా విదేశాలలో నివసిస్తున్న తెలుగు సంస్థలతో పాటు తెలుగేతర సంస్థలను కూడా అందరిని ఏకతాటిపై తెచ్చి  భారతరత్న వచ్చేంతవరకు సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఈ బృహత్ కార్యక్రమంలో ఇప్పటివరకు అమెరికాలోని పలు తెలుగు జాతీయ సంస్థల  సహకారంతో, భారతదేశం నుంచి పలువురు ప్రముఖులతో పాటు డెన్మార్క్, ఉగాండా, సౌదీ అరేబియా, హంగేరి, బ్రూనై, బోత్సవాన, మారిషస్, ఇండోనేషియా, హాంగ్ కాంగ్, థాయిలాండ్, కెనడా, బెహ్రెయిన్, ఫ్రాన్స్, న్యూజీలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, యూఏఈ, ఖతార్, ఒమాన్, నార్వే, లండన్, దక్షిణాఫ్రికా దేశాల్లోని పలు తెలుగు సంస్థలతో 93 టీవీ కార్యక్రమాలను నిర్వహించామని నిర్వాహుకులు తెలిపారు. ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు. ప్రజలు కూడా తమ ప్రయత్నంలో భాగస్వాములవ్వాలని కోరారు. https://www.change.org/BharatRatnaforGhantasala ద్వారా ఘంటసాలకు భారత రత్న ఇవ్వాలంటూ సంతకాలు చేయాలని అభ్యర్థించారు. 

Read more