జూలై 14న రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

ABN , First Publish Date - 2020-06-30T05:58:12+05:30 IST

భారత బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో విడత సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చే నెల 14న ప్రారంభమవుతుంది. జూలై 17న ముగిసే ఈ ఇష్యూ ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించాలని ఈ ఇష్యూని నిర్వహించే ఎడల్‌వైజ్‌ ఏఎంసీ తెలిపింది...

జూలై 14న రెండో విడత భారత్‌ బాండ్‌ ఈటీఎఫ్‌

న్యూఢిల్లీ: భారత బాండ్‌ ఈటీఎఫ్‌ రెండో విడత సబ్‌స్ర్కిప్షన్‌ వచ్చే నెల 14న ప్రారంభమవుతుంది. జూలై 17న ముగిసే ఈ  ఇష్యూ ద్వారా రూ.14,000 కోట్లు సమీకరించాలని ఈ ఇష్యూని నిర్వహించే ఎడల్‌వైజ్‌ ఏఎంసీ తెలిపింది. గత ఏడాది డిసెంబరులో జారీ చేసిన భారత బాండ్‌ ఈటీఎఫ్‌ తొలి ఇష్యూ ద్వారా రూ.12,400 కోట్లు సమీకరించారు. ఈ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఎడల్‌వైజ్‌ ఏఎంసీ ట్రిపుల్‌ ఏ పరపతి రేటింగ్‌ ఉండే ప్రభుత్వ రంగ సంస్థల రుణ పత్రాల్లో మదుపు చేస్తారు. 


Updated Date - 2020-06-30T05:58:12+05:30 IST