కరోనా టీకా: భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య భారీ ఒప్పందం!

ABN , First Publish Date - 2021-02-27T03:12:45+05:30 IST

కరోనా టీకల సరఫరా కోసం భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య శుక్రవారం నాడు భారీ ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్ బయోటెక్ బ్రెజిల్ దేశానికి ఏకంగా 20 మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులు సరఫరా చేయనుంది. భారత్ బయోటక్ ఈ విషయాన్ని నేడు స్వయంగా ప్రకటించింది.

కరోనా టీకా: భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య భారీ ఒప్పందం!

న్యూఢిల్లీ: కరోనా టీకల సరఫరా కోసం భారత్ బయోటెక్, బ్రెజిల్ మధ్య శుక్రవారం నాడు భారీ ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం భారత్ బయోటెక్ బ్రెజిల్ దేశానికి ఏకంగా 20 మిలియన్ల కొవ్యాక్సిన్ టీకా డోసులు సరఫరా చేయనుంది. భారత్ బయోటక్ ఈ విషయాన్ని నేడు స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కొవ్యాక్సిన్ టీకాల సరఫరా ప్రారంభమవుతుందని సమాచారం. కాగా.. ఈ వారం మొదట్లో యూక్రెయిన్ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కూడా హైదరాబద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. ఈ సందర్భంగా కొవ్యాన్స్ పట్ల ఆసక్తి కనబరిచారు. ఇప్పటివరకూ భారత్ వివిధ దేశాలకు 36.197 కోట్ల టీకా డోసులను ఎగుమతి చేసింది. వీటిలో 67.5 డోసులను గ్రాంట్ కింద, మిగతా వాటిని వ్యాపార ఒప్పందాల కింద సరఫరా చేసింది. భారత్ రాబయే నెలల్లోనూ టీకాలను ఎగుమతి చేస్తుందని, అయితే.. దేశీయ అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇస్తుందని విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ గురువారం నాడు వెల్లడించారు. 

Updated Date - 2021-02-27T03:12:45+05:30 IST