Abn logo
Sep 20 2021 @ 18:20PM

ఈనెల 27వ తేదీన భారత్ బంద్ విజయవంతం చేయాలి: నారాయణ

అమరావతి: ఈనెల 27వ తేదీన భారత్ బంద్ విజయవంతం చేయాలని సీపీఐ నేత నారాయణ పిలుపునిచ్చారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ 19 రాజకీయ పార్టీలు ప్రధాని మోదీ హటావో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. గుజరాత్‌లోని ఆదానికి చెందిన మందర సీ పోర్టు ద్వారానే హెరాయిన్ విజయవాడకు వస్తోందని తెలిపారు. ప్రైవేటు వ్యక్తులకు పొర్టులు కట్టబెడితే ఇలాగే ఉంటుందన్నారు. తుపాకీ పెట్టి జీవీకే నుండి ముంబై ఎయిర్‌పోర్ట్ లాక్కున్నారని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో అధికార, ప్రతిపక్షాలు హీనమైన బూతులు మాట్లాడుకుంటున్నారని విమర్శించారు. సినిమా టికెట్ల వ్యవహారం పలువురి చేతిల్లోకి వెళ్లిపోయిందన్నారు. ఆన్‌లైన్‌ చేయడాన్ని సమర్ధిస్తున్నామని నారాయణ ప్రకటించారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...