Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

27న భారత్ బంద్‌.. విజయవంతం చేయాలని కాంగ్రెస్ పిలుపు

twitter-iconwatsapp-iconfb-icon
27న భారత్ బంద్‌.. విజయవంతం చేయాలని కాంగ్రెస్ పిలుపు

జంగారెడ్డిగూడెం: జిల్లా కాంగ్రెస్ కమిటీ, నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో పీసీసీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎస్.కె మస్తాన్ వలి ఏలూరు పర్యటనలో భాగంగా అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభకు అధ్యక్షుడిగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గురునాధ రావు వ్యవహరించారు. ఈ సందర్భంగా మస్తాన్ వలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ అధికారం చేపట్టినప్పటి నుంచి దేశాన్ని ముక్కలుగా విభజిస్తున్నారని మండిపడ్డారు. రైతాంగం పది నెలలుగా మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని దేశవ్యాప్త ఆందోళన చేస్తుంటే.. సరైన నిర్ణయం తీసుకోకపోగా అపహాస్యం చేసే విధంగా మోదీ చర్యలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, బ్యాంకుల ప్రైవేటీకరణ, నల్లధనం వెలికితీత, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, జీఎస్టీ లాంటి ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ దేశాన్ని అమ్మి వేస్తున్నారన్నారు. 


భారతదేశంలో 14 మంది ప్రధాన మంత్రులు రూ. 43 లక్షల కోట్లు అప్పు చేస్తే... ఇప్పుడు మోదీ ఒక కోటి 14 లక్షల కోట్లు అప్పు చేసి భారం మోపారని వ్యాఖ్యానించారు. ఇది చాలదన్నట్లు భారత ప్రభుత్వ సంపదనంతా ప్రైవేటు వ్యక్తులకు అమ్మివేసి  నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా చేశారని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దేశ GDP పూర్తిగా పడిపోయిందని, జీఎస్టీ పేరుతో చిన్న పరిశ్రమలన్నీ మూతపడేలాచేశారని మస్తాన్ వలీ  పేర్కొన్నారు. 


జెట్టి గురునాధరావు మాట్లాడుతూ రైతులకు మద్దతుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బంద్‌లో పాల్గొనేలా చైతన్య పర్చేందుకు మస్తాన్ వలి రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని తెలిపారు. రైతులకు మద్దతుగా జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.


 ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, చింతలపూడి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముప్పిడి శ్రీనివాసరావు, కామవరపుకోట మండల అధ్యక్షుడు మద్దిపట్ల శ్రీనివాసరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ దండుబోయిన చంద్రశేఖర్, జిల్లా జాయింట్ సెక్రటరీ గౌడు రంగబాబు, సిటీ ఓబీసీ ఛైర్మన్ కాటూరి దుర్గాప్రసాద్, సిటీ కాంగ్రెస్ సెక్రెటరీ సాదే బాబు ప్రసాద్, సిటీ ఎస్సీ సెల్ నాయకులు నలగట్ల మాణిక్యాల రావు, ఎస్సీ సెల్ సిటీ ప్రెసిడెంట్ నలగట్ల అనీల్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మిద్దె వెంకటేశ్వరరావు, సేవాదళ్ సుబ్బారావు, బీరమ్ శ్రీధర్, దాసరి రామ్ ప్రసాద్, కొమ్మా ప్రసాద్, మండల కాంగ్రెస్ నాయకులు సాంబశివరావు, తదితర కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పాల్గొన్నారు.



Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.