Oct 19 2021 @ 13:47PM

మంచు మనోజ్ తల్లిగా భానుప్రియ?

మంచు మనోజ్ హీరోగా ప్రస్తుతం ‘అహం బ్రహ్మస్మి’ అనే మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మనోజ్ సొంత నిర్మాణ సంస్థ యం.యం.ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమాతో శ్రీకాంత్ రెడ్డి అనే యువ దర్శకుడు పరిచయం కాబోతున్నారు. డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అండ్ ఎమోషనల్ మూవీగా ఈ సినిమా మెప్పించబోతోంది. అలాంటి ఈ సినిమాలో సీనియర్ నటీమణి భానుప్రియ నటిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. మనోజ్ తల్లిగా ఓ ఎమోషనల్ కేరక్టర్ ను ఆవిడ పోషిస్తోందని టాక్. భానుప్రియ ఇంతకు ముందు ‘మహానటి’ సినిమాలో దుర్గమ్మ పాత్రలో తెరమీద కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే.. ఆవిడ ప్రధాన పాత్రలో త్వరలో ‘నాట్యం’ అనే మూవీ రాబోతోంది. ‘ఛత్రపతి’లో ప్రభాస్ తల్లిగానూ, ‘దమ్ము’లో యన్టీఆర్ తల్లిగానూ నటించిన భానుప్రియ.. ఇప్పుడు మనోజ్ తల్లిగా నటిస్తుండడం విశేషంగా మారింది. మరి ఈ సినిమా భానుప్రియకు ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.