Abn logo
Mar 29 2020 @ 23:36PM

అలాంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు: భానుశ్రీ

బిగ్ బాస్ సీజన్ 2‌తో అందరికీ సుపరిచితమైన భానుశ్రీ ఇప్పుడు బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఓ షోకి యాంకర్‌గా మారారు. తన గొంతు వింటే చాలు ఆమె భానుశ్రీ అని ప్రతి ఒక్కరూ గుర్తుపట్టేలా చేసుకున్న భానుశ్రీ, యాంకర్‌గా బుల్లితెరపై దూసుకుపోతున్నారు. నాని హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 2లో ఆమె 35 రోజుల పాటు హౌస్‌లో గడిపారు. తాజాగా ఆమె బిగ్ బాస్ హౌస్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలిపారు. బిగ్ బాస్ హౌస్ ద్వారానే ప్రేక్షకులలో తనకు గుర్తింపు వచ్చిందని ఆమె అన్నారు.


‘‘హోమ్‌లో వాతావరణం ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. సి.సి కెమెరాల నిఘా మధ్య నిరంతరం కాన్షియస్‌గా ఉన్నా. అప్పుడే రోల్‌ రైడా నాకు క్లోజయ్యాడు. బయట కూడా వాడితో ఎంతో ఆత్మీయంగా ఉంటాను. హోంలో సెలబ్రిటీలందరితోనూ సన్నిహితంగా ఉండేదాన్ని. వాళ్ళందరూ నాతో ఎంతో సరదాగా ఉండేవారు. నిత్యం మంచి ముచ్చట్లు, ఆటలు, పాటలు, తిండి....ఎంతో హాయిగా గడచిపోయింది. అదొక గొప్ప అవకాశం. అలాంటి అవకాశం అందరికీ రాదు. మళ్ళీ మళ్ళీ కోరుకున్నా రాదు. ఈ రియాల్టీ షో ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాను. ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో, వారి ఆప్యాయతను చవి చూశాను’’ అని భానుశ్రీ చెప్పుకొచ్చింది.

Advertisement
Advertisement
Advertisement