బాల్కనీలో భాంగ్రా డ్యాన్స్‌

ABN , First Publish Date - 2020-04-09T05:30:00+05:30 IST

సెలవుల్లో స్నేహితులతో క్రికెట్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేయాలని, డ్యాన్స్‌ నేర్చుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా మూలంగా మొత్తం తారుమారయింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని...

బాల్కనీలో భాంగ్రా డ్యాన్స్‌

  • సెలవుల్లో స్నేహితులతో క్రికెట్‌ ఆడుతూ ఎంజాయ్‌ చేయాలని, డ్యాన్స్‌ నేర్చుకోవాలని అనుకున్నారు. కానీ కరోనా మూలంగా మొత్తం తారుమారయింది. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టలేని పరిస్థితి. అయితేనేం..  ఇంట్లోనే మీకిష్టమైన పనులు చేస్తూ హ్యాపీగా ఉండొచ్చు.


  1. పిల్లలకు రోజూ కనీసం ఒక గంట శారీరక వ్యాయామం అవసరం. కానీ ఇంట్లోనే కూర్చుంటే తగినంత వ్యాయామం లభించదు. అయితే ఇంట్లో మ్యూజిక్‌ పెట్టుకుని డ్యాన్స్‌ చేయడం ద్వారా చురుకుగా ఉండొచ్చు.
  2. ఇరుగు పొరుగు ఇళ్లకు చెందిన నలుగురు పిల్లలు భాంగ్రా డ్యాన్స్‌ చేసి ఆ వీడియోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 
  3. బాల్కనీలో నిలుచుని వాళ్లు చేసిన భాంగ్రా డ్యాన్స్‌ నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. వేలమంది కామెంట్లు పెట్టారు. 4 వేల మంది షేర్‌ చేశారు. 
  4. లాక్‌డౌన్‌ వేళ ఇరుగు పొరుగు వారితో ఇలాంటి గేమ్స్‌ ప్లాన్‌ చేసుకోవడం వల్ల ఫిట్‌గా ఉండవచ్చు. సామాజిక దూరం పాటిస్తూనే సంతోషంగా గడపొచ్చు. ఇండోర్‌ ఆటలు లేదా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం వల్ల శారీరకంగా చురుకుగా ఉండేలా చూసుకోవచ్చు.

Updated Date - 2020-04-09T05:30:00+05:30 IST