భలే రిటర్న్‌ గిఫ్ట్‌..!

ABN , First Publish Date - 2022-07-05T07:28:44+05:30 IST

చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్న హోటల్‌ యాజమాన్యాలకు వారి చెత్తని వారికే రిటర్న్‌ గిఫ్ట్‌గా కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పంపించారు. అలాగే సంబంధిత వ్యాపారులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమాన విధించారు. కడప నగరంలో సోమవారం మార్నింగ్‌ విజిట్‌లో భాగంగా కమిషనర్‌ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న రాఘవేంద్ర

భలే రిటర్న్‌ గిఫ్ట్‌..!
హోటాల్‌ యాజమాన్యానికి రిటర్న్‌ గిఫ్ట్‌ పంపించిన కమీషనర్‌ ప్రవీణ్‌ చంద్‌

రోడ్డుపైనే చెత్తను వేసిన హోటల్‌ యాజమాన్యాలు

ఆ చెత్తను వారికే గిఫ్ట్‌గా పంపిన అధికారి 

రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా


అందంగా ప్యాక్‌ చేసిన పెద్ద డబ్బాను మున్సిపల్‌ ఉద్యోగులు తీసుకుని ఓ హోటల్‌ వద్దకు వచ్చారు. మా సార్‌ పంపించారు అంటూ దానిని అక్కడి యాజమాన్యానికి అందించారు. తెరిచి చూస్తే.. అందులో ఉదయం తాము రోడ్డుపైన వేసిన చెత్త..! బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన వారికి కడప మున్సిపల్‌ కమిషనర్‌ పంపిన రిటన్‌ గిఫ్ట్‌..!


కడప (ఎర్రముక్కపల్లి), జూలై 4: చెత్తను ఎక్కడపడితే అక్కడ వేస్తున్న హోటల్‌ యాజమాన్యాలకు వారి చెత్తని వారికే రిటర్న్‌ గిఫ్ట్‌గా కమిషనర్‌ ప్రవీణ్‌చంద్‌ పంపించారు. అలాగే సంబంధిత వ్యాపారులకు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమాన విధించారు. కడప నగరంలో సోమవారం మార్నింగ్‌ విజిట్‌లో భాగంగా కమిషనర్‌ పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో కొత్త బస్టాండ్‌ సమీపంలో ఉన్న రాఘవేంద్ర టిఫిన్‌, ద్వారకా రెస్టారెంట్‌, డోమినోస్‌ పిజ్జాహబ్‌, బిగ్‌సీ, జయంతి కార్‌ వాష్‌ ప్రాంతాలను పరిశీలించారు. చెత్తను నిర్లక్ష్యంగా రోడ్లపై వేయడం గుర్తించి వారికి అదే చెత్తను నీట్‌గా ప్యాక్‌ చేయించి రిటర్న్‌ గిఫ్ట్‌గా పంపించారు. అలాగే రాఘవేంద్ర టిఫిన్‌, ద్వారకా రెస్టారెంట్లకు లక్ష రూపాయల చొప్పున జరిమానా విధించారు. డోమినోస్‌ పిజ్జాహబ్‌, బిగ్‌సీ, జయంతి కార్‌వాష్‌లకు రూ.25 వేల చొప్పున జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ ప్రతి హోటల్లో చెత్తచాంబర్‌ ఏర్పాటు చేసుకొని వాటిలో చెత్త వేసి దానిని చెత్త సేకరించే మున్సిపల్‌ వాహనాలకు అందించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే టీ బంకుల వద్ద ఒక్క టీ కప్పు రోడ్డు పై కనబడినా సంబంధిత వ్యాపారులకు రూ.500 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. టీ బంకులు చెత్త బిన్లను ఏర్పాటు చేసుకొని వాటిలోనే టీ కప్పులు వేసేటట్లు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 

Updated Date - 2022-07-05T07:28:44+05:30 IST