Advertisement
Advertisement
Abn logo
Advertisement

భక్తి శ్రద్ధలతో భోగి

గన్నవరం, జనవరి 14: మండలంలోని గ్రామాల్లో శుక్రవారం భోగి పండుగను ప్రజలు సంప్రదాయ బద్ధంగా జరుపుకున్నారు. అర్ధరాత్రి నుంచే భోగి మంటలు వేశారు. భోగి మంటల చుట్టూ తిరుగుతూ పాటలు పాడు తూ సందడి చేశారు. చిక్కవరం శ్రీక్షేత్ర హనుమత్‌పురంలో చిన్నారులకు భోగి పండ్లు పోసి దీవించారు. 

హనుమాన్‌జంక్షన్‌ :   భోగి పండుగ  పురస్కరించుకుని శుక్రవారం హనుమాన్‌ జంక్షన్‌లో  పలుచోట్ల  సంబరాలు నిర్వహిం చారు.  పుట్టగుంట సతీష్‌ కుమార్‌ కుటుంబ సభ్యులు మిత్రులతో కలిసి సంబరాలు నిర్వహించారు. 

వైసీపీ  పొలిటికల్‌ రాష్ట్ర సలహా కమిటీ సభ్యులు దుట్టా రామచంద్రరావు ఆధ్వ ర్యంలో  ఆయన  నివాసం  వద్ద  భోగి  వేడుక నిర్వహించారు. ఆయనతో పాటు  వైసీపీ  వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు  శివభరత్‌రెడ్డి,  రవిబాబు పాల్గొన్నారు.

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ :  బాపుల పాడు మండల వ్యాప్తంగా గ్రామాల్లో శుక్రవారం భోగి మంటలతో సంక్రాంతి పండుగ ఆనందాల వెలుగులు విరజి మ్మాయి. రంగన్నగూడెంలో ఆర్‌ఆర్‌డీఎస్‌ ఆధ్వర్యంలో  భోగి మంటలు వేశారు.

ఉయ్యూరు  : భోగి వేడుక శుక్రవారం చిన్నా పెద్ద తేడాలే కుండా ఉత్సాహంగా జరుపుకున్నారు. కూడళ్లలో భోగిమంటలు వేసి ఉల్లాసంగా గడిపారు.  

Advertisement
Advertisement