వనంలో విరిసిన పూజా కుసుమం భక్తశబరి

ABN , First Publish Date - 2021-10-20T05:19:08+05:30 IST

భద్రా చలం సీతారామ చంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేం దుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాల్మీకి రామాయణంలో నిడివి తక్కువగల పాత్ర అయి నా శబరికి ఉన్న ప్రాధాన్యం విశేషమైంది.

వనంలో విరిసిన  పూజా కుసుమం భక్తశబరి
రాముడికి సపర్యలు చేస్తున్న శబరి(చిత్రపటం)

శ్రీరాముడికి ఫల సమర్పణతో ముక్తిపొందిన మహాసాధ్వి

నేడు భద్రాద్రిలో స్మృతియాత్ర 

భద్రాచలం, అక్టోబరు 19: భద్రా చలం సీతారామ చంద్ర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో బుధవారం శబరిస్మృతి యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించేం దుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాల్మీకి రామాయణంలో నిడివి తక్కువగల పాత్ర అయి నా శబరికి ఉన్న ప్రాధాన్యం విశేషమైంది. మాతంగ మహర్షి ఆశ్రమంలో పరిచారికగా మహర్షులకు సేవలు చేస్తూ తరిస్తున్న శబరి రామచంద్రమూర్తి రాక కోసం వేచి చూసింది. ఈ సమయంలో సీతాన్వేషణ నిమిత్తమై తన దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను చూసి ఒక్కసారిగా పొంగిపోయింది. రుచికరమైన పండ్లను, ఏరి ఏరి తీసుకొచ్చి రుచి చూసి ఆ ఎంగిలి పండ్లనే స్వామికి సమర్పించి తన భక్తిని చాటుకుంది. దీంతో రాముడి అనుగ్రహంతో ఆ భక్తురాలు ముక్తిని పొందింది. ఆమె అమాయక భక్తికి మంత్రముగ్దుడైన రామచంద్రుడు ఆమెకు అనుగ్రహించి ముక్తిని ప్రసాదిం చాడు. ఈ నేపఽథ్యంలో శబరిస్మృతి యాత్రను సంప్రదాయ బద్ధంగా నిర్వహించేం దుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది మాదిరిగా ఈ ఏడాది సైతం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శబరి స్మృతి యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తామని దేవస్థానం అధికారులు ఇప్పటికే పేర్కొన్నారు. దమ్మక్క సేవాయాత్ర మాదిరిగానే శబరిస్మతి యాత్రను నిబం ధనలకు అనుగుణంగా, సంప్రదాయబద్దంగా నిర్వహి స్తామని వెల్లడించారు. ఇందుకోసం దేవ స్థానం అధికారులు పలు రకాల ఫలాలు, పుష్పాల తో రామచంద్రుడికి పూజాది కార్యక మాలను నిర్వహించను న్నారు. ముందుగా గిరి ప్రదక్షణ, అనంతరం కల్యాణోత్సవం నిర్వహించి పుష్పాలు, ఫలాలతో మంత్రపుష్పంతో శబరియాత్ర పరిసమాప్తం కానుంది.  

2013లో శ్రీకారం.. 

గిరిజనులు కొలిచే దేవత అయిన భక్తశబరి పేరిట సీతా రామచంద్రస్వామి దేవస్థానం 2013లో శబరిస్మృతి యాత్రకు శ్రీకారం చుట్టింది. అప్పటి స్పెసిఫైడ్‌ అథారిటీ చైర్మన్‌ అయిన వినోద్‌కుమార్‌ అగర్వాల్‌ ప్రతిఏటా ఆశ్వీజమాసంలో పౌర్ణమి రోజున ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని సూచించారు. ఇందులో భాగంగా తొమ్మిదేళ్లుగా ఈ ఉత్స వాన్ని దేవస్థానం అధికారులు నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాదిసైతం కొవిడ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా శబరిస్మృతి యాత్రను నిర్వహించనున్నారు. వైదిక కమిటీ సైతం దేవస్థానం ఈవోకు ఇందుకు సంబంధించి నివేదికను సమర్పించింది. దీంతో బుధవారం దేవస్థానం పరిపాలన, వైదిక సిబ్బందితో ఆలయంలో గత ఏడాది మాదిరిగానే శబరి స్మృతియాత్రను నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.


Updated Date - 2021-10-20T05:19:08+05:30 IST