మాలకొండలో క్యూలైన్ పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి
వలేటివారిపాలెం, మే 28 : మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించమే తన ప్రధాన ధ్యేయమని ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి తెలిపారు. మాలకొండ లక్ష్మీనరసింహస్వామిని శనివారం ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీ లించారు. అనంతరం ఆలయ అధికారులతో మాట్లాడుతూ ఆలయ అబివృద్ధికి దోహదపడే దాతలకు సకల మర్యాదలతో ప్రత్యేక పూజలు చేయించాలన్నారు. దాతల ద్వారా వచ్చే విరాళాలతో ఆలయంలో అబివృద్ధి పనులు చేపట్టాలన్నారు. అనంతరం లడ్డూ కౌంటర్, అన్నదాన ప్రసాదం, క్యూలైన్లు, టాయ్లెట్లు, కోనేరు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ కే.బీ శ్రీనివాసరావు, వైసీపీ నాయకులు కోడూరి వసంతరావు, పరిటాల వీరాస్వామి, అనుమోల వెంకటేశ్వర్లు, చింతలపూడి రవీంద్ర, వరికూటి సంజీవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.