భైంసా ఏరియా ఆసుపత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చాలి

ABN , First Publish Date - 2021-04-19T05:36:26+05:30 IST

కరోనా బాధి తులను ఆదుకునేందుకు గాను భైంసా ఏరియాసుపత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చాలని డీసీసీ అధ్యక్షుడు రామరావ్‌ పటేల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానికంగా విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తు తం కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి మూలం గా కరోనా బాధితు

భైంసా ఏరియా ఆసుపత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చాలి
మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు రామరావ్‌పటేల్‌

భైంసా, ఏప్రిల్‌ 18: కరోనా బాధి తులను ఆదుకునేందుకు గాను భైంసా ఏరియాసుపత్రిని కొవిడ్‌ కేంద్రంగా మార్చాలని డీసీసీ అధ్యక్షుడు రామరావ్‌ పటేల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం స్థానికంగా విలేకరుల సమా వేశం నిర్వహించి మాట్లాడారు. ప్రస్తు తం కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి మూలం గా కరోనా బాధితుల సంఖ్య రోజురోజు కు పెరుగుతుందన్నారు. ముథోల్‌ నియో జకవర్గ పరిధిలో ప్రతీ రోజు 250నుంచి 300 మంది కరోనా బారిన పడుతుండగా.. 5నుంచి 10 మంది వరకు మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. స్థానికంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందక పోవడం మూలంగా కష్టనష్టాలు తప్పడం లేదన్నారు. ఏరియాసుపత్రి లో 14మంది డాక్టర్లు. నాలుగు వెంటిలేటర్లతో పాటు బాధితులకు ఆక్సిజన్‌ అందించేందుకు గాను వ్యవస్థ ఉండడం మూలంగా ఇక్కడి ఏరియాసుపత్రిని కోవిద్‌ ఆసుపత్రిగా మారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ముథోల్‌ నియోజక వర్గం వ్యాప్తంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అందగ పోవడం మూలంగా నిజా మాబాద్‌,. హైదరాబాద్‌ ఆసుపత్రులకు తరలిపోవాల్సి వస్తుందన్నారు. అక్కడ పడకలు దొరకక, వైద్య ఖర్చులు భరించలేని స్థాయిలో ఉండ డం మూలంగా బాధితులు, వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడు తూ ఆవేదన చెందుతున్నాయన్నారు. ఇలాంటి సమస్యను పరిష్కరిం చేందుకు గాను ప్రభుత్వం తక్షణమే ఏరియాసుపత్రిని కోవిద్‌ ఆసుపత్రి గా మార్చాలని పేర్కొన్నారు. ఈ మేరకు సంబంధిత విషయాన్ని  సీఎంతో పాటు అందరికీ వినతిపత్రాలను పంపారు.

Updated Date - 2021-04-19T05:36:26+05:30 IST