Jun 17 2021 @ 06:26AM

స‌ల్మాన్ అభిమానుల‌కు శుభ‌వార్త‌... దీపావ‌ళికి భాయీజాన్ విడుద‌ల‌!

ఇటీవ‌లి కాలంలో బాలీవుడ్ భారీ చిత్రాల గురించి చర్చలు న‌డుస్తున్నాయి. ఈ నేప‌ధ్యంలో కండ‌ల‌వీరుడు సల్మాన్ ఖాన్ తన అభిమానుల కోసం మరో స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నాడు. స‌ల్మాన్ సినిమా కభీ ఈద్ కభీ దివాలీపై అనేక వార్త‌లు వినిపించాయి. మీడియాకు అందిన స‌మాచారం ప్రకారం కభీ ఈద్ కభీ దివాలీ టైటిల్‌ను భాయీజాన్‌గా మార్చారు. ఇంతేకాకుండా ఈ సినిమా విడుదల తేదీ గురించి కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. సల్మాన్, పూజా హెగ్డే నటించ‌బోయే ఈ చిత్రం 2022 దీపావ‌ళికి విడుద‌ల కానుంది. 

క‌రోనా పరిస్థితులు కొంత‌మేర‌కైనా చ‌క్క‌బ‌డ్డాక సల్మాన్ ఖాన్ తన పన్వెల్ ఫామ్ హౌస్ వద్ద ఈ చిత్రం కోసం ఫోటోషూట్ చేయనున్నట్లు స‌మాచారం. ఫోటోషూట్‌లో సల్మాన్‌ఖాన్‌ను తెల్ల కుర్తా-జీన్స్‌, క్లీన్ షేవెన్ లుక్‌తో చూడవచ్చనే వార్త‌లు వినిపిస్తున్నాయి. అన్నాద‌మ్ముల అనుబంధం ఆధారంగా ఈ చిత్రం రూపొంద‌నుంది, ఈ చిత్రంలో సల్మాన్, పూజాలతో పాటు ఆయుష్ శర్మ, జహీర్ ఇక్బాల్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం షూటింగ్ 2021 నవంబర్ నెలలో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ జూలై 2021లో విడుదల కానుంది.