దళితుల అభివృద్ధికి భాగ్యరెడ్డి అవిశ్రాంత కృషి

ABN , First Publish Date - 2022-05-23T04:59:37+05:30 IST

దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మెదక్‌ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కొనియాడారు.

దళితుల అభివృద్ధికి భాగ్యరెడ్డి అవిశ్రాంత కృషి
సంగారెడ్డి కలెక్టరేట్‌లో భాగ్యరెడ్డివర్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్లు

సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్‌లలో ఘనంగా భాగ్యరెడ్డి వర్మ జయంతి   

సంగారెడ్డి రూరల్‌/మెదక్‌, మే 22: దళితుల అభ్యున్నతికి ఎనలేని కృషి చేసిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, మెదక్‌ జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కొనియాడారు. ఆదివారం భాగ్యరెడ్డి వర్మ 134వ జయంతి సందర్భంగా సంగారెడ్డి, మెదక్‌ కలెక్టరేట్‌లలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆది ఆంధ్ర సభ స్థాపకుడు, అంటరాని కులాల ఉద్యమానికి మన్య సంఘం ఏర్పాటు చేయడంతో పాటు బాలికల కోసం పాఠశాలలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ అని అన్నారు. 1906-1933 మధ్య కాలంలో హైదరాబాద్‌ సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి పాటుపడ్డారని గుర్తు చేశారు. అహింస సమాజ నిర్మాణానికి కృషి చేసిన వ్యక్తి అని, వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా ప్రతీఒక్కరు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో సంగరెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి అఽధికారి అఖిలే్‌షరెడ్డి, మెదక్‌ జిల్లా ఖనిజాభివృద్ధి శాఖ ఏడీ జయరాజ్‌, ఏఎ్‌సడబ్ల్యూవో లింగేశ్వర్‌, ట్రోన్స్‌కో ఏవో సూపరింటెండెంట్‌ గోపాల్‌, కలెక్టరేట్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-23T04:59:37+05:30 IST