వారం రోజుల్లో ‘భగీరథ’ పనులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-07-10T10:13:10+05:30 IST

వారంలో మిషన్‌ భగీరథ పనులు ప్రారంభిస్తామని మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గోవర్ధన్‌రెడ్డి, జీఎం కళ్యాణ్‌శ్రీనివాస్‌ అన్నారు. గురువారం వారు షాద్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పథకం కింద ఆర్‌డబ్ల్యూఎస్‌

వారం రోజుల్లో ‘భగీరథ’ పనులు ప్రారంభం

షాద్‌నగర్‌: వారంలో మిషన్‌ భగీరథ పనులు ప్రారంభిస్తామని మిషన్‌ భగీరథ ప్రాజెక్ట్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ గోవర్ధన్‌రెడ్డి, జీఎం కళ్యాణ్‌శ్రీనివాస్‌ అన్నారు. గురువారం వారు షాద్‌నగర్‌లో మిషన్‌ భగీరథ పథకం కింద ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయం ఆవరణ, మల్లికార్జునకాలనీల్లో నిర్మిస్తున్న ట్యాంకుల నిర్మాణాలను పరిశీలించారు.


అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌చైర్మన్‌ నటరాజన్‌లతో సమావేశమయ్యారు. సంవత్సరంలోపే పట్టణంలో ఏడు ట్యాంకులు, ఇంటింటికీ పైప్‌లైన్ల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. సమావేశంలో షాద్‌నగర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ సాజిద్‌, ఏఈ మల్లికార్జున్‌గౌడ్‌, మెగావర్క్స్‌ ఇన్‌చార్జి మోహన్‌, కౌన్సిలర్‌ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. 


ఇబ్రహీంపట్నంలో..

ఇబ్రహీంపట్నం: ఎట్టకేలకు ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో మిషన్‌ భగీరథ పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రెండేళ్లుగా ఇక్కడ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గురువారం మెగా ఇంజనీరింగ్‌ డీఎం కళ్యాణ్‌ శ్రీనివాస్‌, గోవర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ డీఈ కిరణ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్రవంతి, వైస్‌చైర్మన్‌ ఆకుల యాదగిరి నిలిచిపోయిన ట్యాంకుల నిర్మాణ పనులతోపాటు పైప్‌లైన్‌ వేయాల్సిన రూట్లను పరిశీలించారు. వారం పది రోజుల్లో పనులు ప్రారంభించనున్నట్లు డీఈ తెలిపారు. 

Updated Date - 2020-07-10T10:13:10+05:30 IST